శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : ఆదివారం, 23 నవంబరు 2014 (16:37 IST)

ఉలగనాయగన్ పేరుతో యూట్యూబ్‌లో కమల్ చానల్

విశ్వనాయకుడు కమల్ హాసన్ యూట్యూబ్‌లో చానల్ ప్రారంభించారు. భవిష్యత్తు సినిమా అంతా డిజిటల్‌మయమేనని నమ్మే ఆయన ఆ దిశగా తన ఆలోచనలను కార్యాచరణలో పెడుతున్నారు. కమల్ హాసన్ సినిమా గురించి తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకొనే విధంగా ఒక చానల్‌ను ప్రారంభిస్తే బాగుంటుందనే కోరికను వెలిబుచ్చారట. 
 
ఆయన కోరిక మేరకు 'ఉలగనాయగన్' పేరుతో ఇంటర్నెట్‌లో ఒక యూ ట్యూబ్ చానల్ ప్రారంభించారు. కె.వాయ్ మొళి అనే ప్రత్యేక బృందం ఈ చానల్‌ను నిర్వహిస్తోంది. ఇందులో సెలబ్రిటీలు, అభిమానులు అడిగే ప్రశ్నలకు కమల్ సమాధానాలు చెబుతారు.