శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Modified: బుధవారం, 27 ఆగస్టు 2014 (19:24 IST)

మాఫియాకు-ప్రేమ జంటకు మధ్య పోరాటం

షఫీ కీలక పాత్రలో, హేమంత్‌, షిప్రా నటీనటులుగా 'ప్యారడైజ్‌' చిత్రం బుధవారం సారథి స్టూడియోలో ప్రారంభమైంది. నాగసత్య పిక్చర్స్‌ పతాకంపై రవిచంద్రన్‌ దర్శకత్వంలో బి. సత్యనారాయణ నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం తొలి సన్నివేశానికి నిర్మాత దామోదర ప్రసాద్‌ క్లాప్‌నిచ్చారు. అల్లు రామకృష్ణ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. అనంతరం దామోదర ప్రసాద్‌ మాట్లాడుతూ...
 
ఇటీవల సినిమా పరిశ్రమ ఓ పద్ధతిలో చక్కగా నటుస్తోంది. మంచి క్వాలిఫికేషన్‌ ఉన్న దర్శకులు సినీరంగంలో అడుగుపెడుతున్నారు. అందులో ఎక్కువ శాతం సాప్ట్‌వేర్‌ వారే ఉన్నారు. రవిచంద్రన్‌ తీస్తున్న ఈ సినిమా సక్సెస్‌ కావాలి అని అన్నారు.
 
దర్శకుడు రవిచంద్రన్‌ మాట్లాడుతూ... బోస్టన్‌ బర్క్లి స్కూల్లో దర్శకత్వ శాఖతోపాటు పలు శాఖల్లో శిక్షణ తీసుకున్నాను. దర్శకుడిగా తొలి చిత్రమిది. దేశంలో ముంబయి, హైదరాబాద్‌లో మాఫియా బాగా అభివృద్ధి చెందింది. మంచిచెడూ ఈ రెండు ప్రాంతాల్లోనే ఉంది. అటువంటి మాఫియాకి, ఓ ప్రేమ జంటకి మద్య సాగే చిత్రమిది. హారిబుల్‌ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కనుంది. షఫిగారితోపాటు మరో ఐదు కీలక పాత్రలుంటాయి. రెగ్యూలర్‌ సినిమాలకు భిన్నంగా ఉండే చిత్రమిది అని తెలిపారు.
 
షఫి మాట్లాడుతూ... దర్శకుడు కథ చెప్పిన విధానం నచ్చింది. మంచి ఇంటెన్స్‌ ఉన్న కథ ఇది. ముందు ఏం జరగబోతుందనే క్యూరియాసిటీ కలిగించేలా ఉంటుంది. దర్శకుడికి మంచి ప్రాజెక్ట్‌ అవుతుంది అని అన్నారు. నిర్మాతగా తొలి చిత్రమిదని సత్యనారాయణ తెలిపారు. ఈ సినిమాతో నటీనటులుగా పరిచయం కావడం ఆనందంగా ఉందని హీరో హేమంత్‌, షిప్రా తెలిపారు. ధనరాజ్‌, రఘు కారుమంచి, సత్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: యోగి, సంగీతం: స్ట్రింగ్‌ సతీష్‌, ఆర్ట్‌: విజయకృష్ణ.