శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : శనివారం, 28 ఫిబ్రవరి 2015 (15:28 IST)

సొంత బ్యానర్‌లో పవర్ స్టార్.. 'సర్దార్'గా టైటిల్ రిజిస్టర్..!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లో కొత్తదనం ఉట్టిపడుతోంది. ఇటీవల 'గోపాల గోపాల' చిత్రం ద్వారా ఆధునిక కృష్ణుడిగా అవతారమెత్తిన పవన్ త్వరలో 'సర్దార్'గా తెరపైకి రానున్నారు. ఎందుకంటే, ఈ టైటిల్ని ఆయన కోసం ఫిలిం ఛాంబర్‌‌లో రిజిస్టర్ చేసుకున్నారు. ఈ సినిమా ఆయన సొంత బ్యానర్ పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అప్లై చేయగా మరో విశేషం. 
 
ఈ విషయాన్ని ఫిలిం ఛాంబర్ వర్గాలు వెల్లడించాయి. అయితే, దీనికి దర్శకత్వం ఎవరు వహిస్తారనేది తెలియలేదు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం 'గబ్బర్ సింగ్ 2' ప్రాజక్టులో బిజీగా ఉన్న పవన్, తర్వాత ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావుకు ఓ చిత్రం చేయనున్నారు. ఆ తర్వాతే 'సర్దార్' సెట్‌పైకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.