శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 1 సెప్టెంబరు 2014 (19:10 IST)

పవన్ నా గురువు: ఫేస్ బుక్‌లో రేణూ దేశాయ్

నటుడు పవన్ కల్యాణ్‌పై ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. పవన్ నుంచి ఆమె దూరమైనప్పటికీ ఆయన తన గురువు అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫిలిం మేకింగ్‌కు సంబంధించి పవన్ కల్యాణ్ తనకు గురువు అని పేర్కొన్నారు. తన జీవితంలో పవన్ కంటే మంచి టీచర్ మరెవరూ లేరని ఫేస్ బుక్‌లో తెలిపారు. 
 
సినిమా నిర్మాణంలో పరిపూర్ణత సాధించడానికి తోడ్పడిన పవన్‌కు రుణపడి ఉంటానన్నారు. తన నూతన చిత్ర ట్రైలర్‌ను ఆగస్టు 26న విడుదల చేయాల్సి ఉందని, అయితే, అది సెప్టెంబర్ 2కి వాయిదా పడిందన్నారు. ఆరోజు (సెప్టెంబర్ 2) పవన్ కల్యాణ్ పుట్టిన రోజు కావడం కాకతాళీయమేనని రేణూ తెలిపారు. 
 
తన జీవితంలో గొప్ప వ్యక్తి పవన్ అనీ, ఆయన జన్మదినం రోజున ట్రైలర్ విడుదల చేయడాన్ని దేవుడిచ్చిన వరం అనుకుంటానని రేణూ దేశాయ్ చెప్పారు. మన ఆలోచనలకు భగవంతుడు ఇలాంటి యాదృచ్ఛిక ఘటనల రూపంలో సమాధానాలు చెబుతాడని ఎక్కడో చదివానని ఆమె గుర్తు చేసుకున్నారు. ఇదే విషయాన్ని పవన్‌కు చెబితే నవ్వి ఊరుకున్నాడని వెల్లడించారు.