పెసరట్టు మాడిపోయింది... కూర్చోలేక పరుగెడుతున్నారు...

pesarattu
DV| Last Modified శనివారం, 7 ఫిబ్రవరి 2015 (20:19 IST)
ఈ శుక్రవారమే 'పెసరట్టు' సినిమా విడుదలైంది. అందరినీ కొత్తవారితో కత్తి మహేష్‌ అనే దర్శకుడు తెరకెక్కించిన చిత్రమది. గతంలో 'హృదయ కాలేయం'లో ఎస్‌.ఐ. పాత్ర వేసిన పొట్టి వ్యక్తిగా నెటిజన్లకు పరిచయమే. ఇతనికి ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ నాలెడ్జ్‌ బాగుంది. కాగా, ఇటీవలే జాతీయస్థాయిలో అవార్డు పొందిన 'నా బంగారుతల్లిని' విడుదల చేయడానికి ఫేస్‌బుక్‌ ద్వారా ఫౌండ్‌‌తో విడుదల చేశారు.

ఆ తరహాలో ఈయనా ఫండ్‌ రైజింగ్‌ చేసి తీసిన సినిమా ఇది. కాగా, ఈ సినిమాలో నటించిన ఎక్కువమంది ఫేస్‌బుక్‌ బ్యాచే. సంపూర్ణేష్‌ బాబు ఓ ప్రధాన పాత్ర పోషించాడు. శుక్రవారంనాడు విడుదలైన ఈ సినిమాను చూసి ప్రేక్షకులు కూర్చోలేక బయటకు పరుగెడుతున్నారు.

ట్విస్ట్‌ ఏమంటే.. ఈ దర్శకుడు అన్ని సినిమాలను విశ్లేషిస్తూ నెగెటివ్‌గా ఓ ఛానల్‌లో మొట్టికాయలు వేస్తుంటాడు. మరి ఈ పెసరట్టు చిత్రానికి ఆ ఛానల్‌లో రాకుండా మేనేజ్‌ చేయడమే కాకుండా.. తను చేసిన గొప్ప కళాఖండాన్ని సమర్థించుకుంటున్నాడు. మరి అందరు దర్శకులు తమ సినిమాలను అలాగే అనుకుంటారు కదా.. ఆ విషయం ఇతను తెలుసుకోవాలికదా.. కాదంటారా...దీనిపై మరింత చదవండి :