శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 24 నవంబరు 2014 (10:47 IST)

బాహుబలి : ప్రభాస్-రానాల మధ్య రామోజీ ఫిలిమ్ సిటీలో...

బాహుబలి.. భళ్లాల దేవ సోదరులే అయినా ఇద్దరి మధ్యా ఆధిపత్యపోరు హోరాహోరీగా జరుగనుంది. వీరిద్దరూ సమజ్జీవులే. కదన రంగంలోకి దూకారంటే ప్రళయం వచ్చిందా అన్నట్టుగా ఇద్దరి మధ్యా పోరు సాగుతుంది. 
 
ప్రస్తుతం అలాంటి యుద్ధ సన్నివేశాలనే వీరిద్దరి మధ్యా దర్శకుడు రాజమౌళి చిత్రీకరిస్తున్నాడు. ఇందులో బాహుబలిగా ప్రభాస్, భళ్లాలదేవగా రానా దగ్గుబాటి నటిస్తున్నారు. వీరి మధ్య ఈ భీకరమైన యాక్షన్ దృశ్యాలను హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో పీటర్ హేన్స్ నేతృత్వంలో భారీ ఎత్తున చిత్రీకరిస్తున్నారు.
 
ఫిలిం సిటీలోని హిల్ ప్రాంతంలో ఈ దృశ్యాలను షూట్ చేస్తున్నారు. ఈ నెలాఖరు వరకు వీటి చిత్రీకరణ కొనసాగుతుంది. ఈ 'బాహుబలి' చిత్రాన్ని సుమారు 150 కోట్ల బడ్జెట్టుతో నిర్మిస్తున్నారు.