శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : గురువారం, 27 నవంబరు 2014 (09:57 IST)

సూర్య 'మాస్‌'లో ప్రణీతకు ఛాన్స్.. బంపర్ ఆఫర్ కొట్టేసింది

బాపుబొమ్మ ప్రణీతకు బంపర్ ఆఫర్ కొట్టేసింది. పవర్‌స్టార్ 'అత్తారింటికి దారేది'తో తన కెరీర్ మరో మలుపు తిరుగుతుందని భావించిన ప్రణీతకు నిరాశే ఎదురయ్యింది. ఈ సినిమా తర్వాత ఆమె చేసిన 'రభస' కూడా ప్లాఫ్ కావడంతో  అవకాశాలు లేక డీలా పడిపోయింది. 
 
ఈ సమయంలో ఈమెకు వూహించని ఆఫర్ దక్కింది. ఏకంగా తమిళ సూపర్ స్టార్ సూర్య సరసన నటించే అవకాశం దక్కించుకుంది. సూర్య హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'మాస్'. 
 
తొలుత ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎమీ జాక్సన్ ఎంపికైంది. అయితే సడన్‌గా ఈ అమ్మడు సూర్య సినిమా నుంచి తప్పుకోవడంతో, ఆమె స్థానంలో ప్రణీతను ఎంపిక చేశారు. మరీ ఈ సినిమానైన ప్రణీత కేరియార్‌ను మలుపుతిప్పుతుందో లేదో వేచి చూడాలి.