శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 26 ఆగస్టు 2014 (19:50 IST)

తులసి ప్రొడక్షన్స్‌ 'ప్రేమిస్తే.. పోయేకాలం'

వానొస్తే.. వానాకాలం, చలేస్తే.. శీతాకాలం, మరి ప్రేమిస్తే..? 'పోయేకాలం' అంటున్నారు నవ దర్శకనిర్మాతలు జి.రవిచంద్ర-డి.ఇ.రాజు. తులసి ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.1గా శ్రీమతి రమణేశ్వరి సమర్పణలో జి.రవిచంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. డి.ఇ.రాజు నిర్మిస్తున్న వినూత్న ప్రేమకథా చిత్రం 'ప్రేమిస్తే పోయేకాలం'. 
 
ప్రవీణ్‌కుమార్‌ హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో సీనియర్‌ నటీమణి సుధ తల్లి పాత్ర పోషిస్తుండగా.. కిరేష్‌, అశోక్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శ్వేత కథానాయకి. కె.కార్తీక్‌ సంగీత సారధ్యం వహించిన ఈ చిత్రం ఆడియో  ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా విడుదలవుతోంది. ఈ చిత్రం ఆడియో వేడుక సెప్టెంబర్‌ 14న హైద్రాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్స్‌ ప్రివ్యూ థియేటర్‌లో జరగనుంది.
 
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నిర్మాత డి.ఇ.రాజు మాట్లాడుతూ... 'ఈ చిత్రం ద్వారా రవిచంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. ఈ చిత్రాన్ని రవిచంద్ర ఎంతో అద్భుతంగా తీసాడు. అలాగే మదర్‌ క్యారెక్టర్‌కు గల ఇంపార్టెన్స్‌ దృష్ట్యా.. సీనియర్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ సుధను ఆ పాత్రకు ఎంపిక చేశాం. సినిమా చాలా బాగా వచ్చింది, ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. సెప్టెంబర్‌ 14న పాటలు విడుదల చేసి, అదే నెల చివరిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం' అన్నారు.
 
చిత్ర దర్శకుడు జి.రవిచంద్ర మాట్లాడుతూ... 'మదర్‌ సెంటిమెంట్‌తో ఇంతకు మునుపు చాలా చిత్రాలు వచ్చాయి. కానీ ఈ చిత్రంలో తల్లీకొడుకుల మధ్య ఉన్న ప్రేమానుబంధాలను ఏ చిత్రంలోనూ చూపించని విధంగా, ప్రతి ఒక్కరి హృదయాన్ని కరిగించేలా రూపొందించాం. ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చిన నిర్మాత డి.ఇ.రాజుగారికి నా కృతజ్ఞతలు' అన్నారు. ఈ చిత్రానికి సాహిత్యం: కార్తీక్‌-రామారావు-సుబ్బు- అరవింద్‌రావు, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ భాస్కర్‌, ఛాయాగ్రహణం: డా||అశోక్‌, సమర్పణ: శ్రీమతి రమణేశ్వరి, నిర్మాత: డి.ఇ.రాజు, మాటలు-చిత్రానువాదం-దర్శకత్వం: జి.రవిచంద్ర.