శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 17 ఏప్రియల్ 2015 (19:18 IST)

రాజేంద్రప్రసాద్ గెలుపు: నలుగురికి ఉపయోగపడాలనే ధర్మ యుద్ధానికి దిగాం!

మా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రాజేంద్ర ప్రసాద్ తన ప్యానెల్ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు. మా ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాలపై రాజేంద్ర ప్రసాద్ అసహనం వ్యక్తం చేశారు. తెలుగు సినిమా నటీనటుల సంఘం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా నటుడు డాక్టర్ రాజేంద్రప్రసాద్ ఎన్నికయ్యారు.

సహజనటి జయసుధపై 83 ఓట్ల తేడాతో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ విజయం సాధించారు. దీంతో రాజేంద్రుడిని ఎట్టకేలకు మా అధ్యక్ష పదవి వరించింది. ఫిలిం ఛాంబర్ వద్ద రాజేంద్ర ప్రసాద్ అభిమానులు, మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు. 
 
నాటకీయ పరిణామాల మధ్య జరిగిన మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) ఎన్నికల్లో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్యానల్ జయకేతనం ఎగురవేసింది. మొత్తం 7 రౌండ్ల పాటు కౌంటింగ్ జరుగగా, రాజేంద్ర ప్రసాద్ 69 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించినట్టు తెలిసింది. మొత్తం 702 ఓట్లు ఉన్న 'మా'లో 394 ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి. దీంతో రాజేంద్రుడి గెలుగు ఖాయమైంది. 
 
ఈ  సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. నలుగురికి ఉపయోగపడాలని, కష్టపడేవారికి సహాయం చేయాలనే తన టీమ్ ధర్మ యుద్ధానికి దిగిందన్నారు. ఎన్నికల ఫలితాల్లో తీర్పు ఎలా వచ్చినా అది పదిమందికి ఉపయోగపడాలన్నదే తన కోరిక అని చెప్పారు. 'మా' అసోసియేషన్ లో ఉండే ఆ నలుగురు, సినీ కళాకారుల్లో మరో నలుగురికి ఉపయోగపడాలని కోరుకుంటున్నానని తెలిపారు.