1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By IVR
Last Modified: గురువారం, 24 జులై 2014 (15:02 IST)

రజనీకాంత్‌ 'తలైవా' ఎలా అయ్యారు... లింగా షూటింగ్ లో రజినీకాంత్...

దక్షిణాది సూపర్‌స్టార్‌ అని రజనీకాంత్‌‌ను అంటారు. ఆయన చాలా మంచివాడు.. దయార్దహృదయుడు అంటూ తమిళులు నెత్తికెక్కించుకుంటారు. టాలీవుడ్‌లోనూ ఆయన గురించి చెడుగా మాట్లాడేవారు చాలా తక్కువ. వ్యక్తిగతంగానూ మంచివాడుగా చెబుతుంటారు. అయితే అసలు ఈ పేరు ఎలా వచ్చింది. ఎవరికి ఏమి చేశాడు? అనేది చాలామందిలో ఆసక్తి కల్గిస్తుంది. 
 
తన పుట్టినరోజునాడు సరే.. మిగిలిన రోజుల్లోనూ వ్యక్తిగతంగా కష్టాల్లో ఉన్నవారికి ధైర్యాన్ని చెప్పి.. ఎంతో కొంత ఆర్థిక సాయం చేస్తాడని చెబుతారు. పబ్లిసిటీలు కూడా పెద్దగా ఇచ్చుకోడు. అసలు విషయం ఏమిటంటే.... ఇటీవల ఆయన నటిస్తున్న తాజా చిత్రం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఆయన జగపతిబాబుతో కలిసి చేసిన 'కథానాయకుడు' చిత్రం కూడా ఇక్కడే జరిగింది. 
 
అప్పటి నుంచి గమనిస్తున్న ఓ యూనిట్‌ సభ్యుడు... ఆయన మంచితనాన్ని వల్లెవేస్తున్నాడు... సెట్లోకి వచ్చాక.. అందరినీ సమానంగా చూస్తాడట. భోజనాల సమయంలో ఆయనకు సెపరేట్‌గా టేబుల్‌ వేస్తే... ఎవరైనా వస్తే వెంటనే కూర్చోమని చెప్పి.. తనే భోజనం వడ్డిస్తాడట. వారితో మాటలాడుతు కుటుంబ విషయాలు అడగడం మరో విశేషం. ఒక స్టార్‌ హీరో ఇలా అడగటం వారికి ఎంతో ధైర్యాన్నిస్తుంది. 
 
తను ప్రయాణిస్తున్న కారు ఇలాగే ఉండాలని రూలేమీలేదు. బస చేసిన స్థలం నుంచి సెట్‌కు ఏ తరహా కారైనా ఫర్వాలేదు అని చెబుతాడట. అలాగే ఓ కారులో వస్తూ.... సిగరెట్‌ తాగాల్సి వస్తే... కారు ఆపి దూరంగా వెళ్ళి.. కాసేపు అక్కడే నిలబడి సిగరెట్‌ తాగి వచ్చే తత్త్వం ఆయనది... అని యూనిట్‌ చెబుతుంటే.. ఆశ్చర్యపోకమానని వారు ఎవ్వరూ ఉండరు మరి. 
 
అదేగనుక తెలుగు హీరోలయితే... ఇందుకు భిన్నంగా ఉంటారని... కొందరు హీరోలయితే ఏకాంతం భంగం కలుగుతుందని ఆ చుట్టుపక్కల ఎవ్వరినీ రానివ్వని సందర్భాలు చాలా చూశామని రజనీ చిత్రానికి పనిచేస్తున్న మన తెలుగు యూనిట్‌వారు చెబుతుంటే... అందుకే... రజనీ తలైవా అయ్యాడనిపిస్తుంది. అంటే తమిళలులు ఆయన్ను దేవుడిగా ట్రీట్‌ చేస్తుంటారు. ఆయన మంచితనమే... ఇటీవల అనారోగ్యాన్నుంచి కాపాడిందని యూనిట్‌లో చెప్పుకుంటుంటే ఇది కాక మరేమిటి అనిపిస్తుంది. దటీజ్ రజినీకాంత్.