శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 25 అక్టోబరు 2014 (13:14 IST)

రజినీకాంత్ లింగా ఆడియో: Nov14న ముహూర్తం ఖరారు!

రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లింగా ఆడియోకు రంగం సిద్ధమైంది. ఈ సినిమా ఆడియో వేడుక అట్టహాసంగా జరుగనుంది. నవంబర్ 14వ తేదీని లింగా ఆడియో కోసం ముహూర్తంగా చిత్ర యూనిట్ ఖరారు చేసింది. 
 
ఆ తర్వాత నవంబర్ మూడో వారంలో తెలుగు వెర్షన్ ఆడియో కార్యక్రమాన్ని హైదరాబాదులో నిర్వహిస్తారు. కేయస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమం ఇప్పటికే పూర్తయింది. డిసెంబర్ 12న రజనీ జన్మదినం రోజున ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడానికి ఇప్పటికే నిర్ణయించారు. ఈ సినిమాలో రజినీకాంత్ సరసన సోనాక్షి సిన్హా, అనుష్క కథానాయికలుగా నటించారు.