శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Updated : శనివారం, 30 ఆగస్టు 2014 (16:55 IST)

రజినీకాంత్ 'లింగా' ఫస్ట్ లుక్... మొదటి రోజునే 50లక్షల హిట్స్

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్నచిత్రం ‘లింగా’. ఈ చిత్రంలో సూపర్ స్టార్ రజనీకి జోడిగా అందాల భామలు అనుష్క శెట్టి, సోనాక్షి సిన్హా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కెఎస్ రవి కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రేజీ ప్రొడ్యూసర్ రాక్ లయన్ వెంకటేష్ నిర్మాతగా రాక్ లయన్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సౌత్ ఇండియాలో అత్యంత భారీగా తెరకెక్కుతున్న చిత్రంగా లింగాకి ఇప్పటికే యావత్ ప్రపంచమంతా భారీ అంచనాలున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇండియాలోని అతి ఉత్తమమైన సాంకేతిక నిపుణులు పనిచేస్తున్న ఈ లింగా మొదటి లుక్ నుంచే చరిత్ర సృష్టిస్తుంది. వినాయక చవితి సందర్భంగా విడుదల చేసిన ఈ మొదటి లుక్‌కి మొదటి రోజునే 50 లక్షల హిట్స్ రావటం ఈ సినిమాకి మొదటి రికార్డుగా చెప్పవచ్చు. 
 
ఈ సినిమా ఆడియోని దీపావళికి రిలీజ్ చేసి సినిమాని సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ “మా బ్యానర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం లింగా. సూపర్ స్టార్ రజనీకాంత్ గారితో మేము చిత్రం చేయటం చాలా హ్యాపీగా ఉంది. ఆయన సరసన అనుష్క, సోనాక్షి సిన్హా నటిస్తున్నారు. రెహమాన్ సంగీతం, రత్నవేలు కెమెరా ఇలా భారతదేశంలో ఉన్నతమైన సంకేతిక నిపుణులతో ఈ చిత్రం చేస్తున్నాము. కెఎస్.రవి కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాము. 
 
రవి కుమార్, రజనీకాంత్ కాంబినేషన్లో వచ్చిన ముత్తు, అరుణాచలం ఎంత పెద్ద విజయాలు సాధించాయో అందరికి తెలిసిందే. ఈ సినిమా ఆ రెండు చిత్రాలని మించి ఉంటుంది. లింగా చిత్రానికి సంబంధించి మొదటి లుక్‌ని ఈ వినాయక చవితికి రిలీజ్ చేసాము. చూసిన ప్రతి ఒక్కరు తలైవా , సూపర్ స్టార్ రజనీకాంత్ గారి లుక్ అదిరిపోయింది అంటున్నారు. అంతేకాకుండా ఒక్కరోజులోనే రికార్డు హిట్స్ ఇచ్చి కొత్త రికార్డుని సృష్టించారు. ఇంతటి ఆనందాన్ని మాకు , మా టీంకి ఇచ్చిన వారందరికీ మా ధన్యవాదాలు. రెహమాన్ గారు అందించిన సంగీతం దీపావళికి విడుదల చేసి, సినిమాని సూపర్ స్టార్ రజనీకాంత్ గారి పుట్టిన రోజున విడుదల చేస్తాము” అని అన్నారు

వెబ్ దునియా తెలుగు తాజా వార్తలు, సినిమా, ఆరోగ్యం ఇతర విశేషాలను మీ మొబైల్(ఆండ్రాయిడ్) ఫోనులో చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.