శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: గురువారం, 16 అక్టోబరు 2014 (14:16 IST)

రజినీకాంత్ కోసం భాజపా... ఫిలిమ్ సిటీలో తలైవా డ్యాన్స్ డ్యాన్స్!

రజినీకాంత్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీలో వున్నారు. 'లింగా' చిత్రానికి సంబంధించిన ఓ పాటను అక్కడ చిత్రిస్తున్నారు. గురు, శుక్ర, శనివారాలకు ఆ పాట పూర్తికానున్నట్లు తెలియవచ్చింది. సోనాక్షి సిన్హాపై ఆ పాటను చిత్రీకరిస్తున్నారు. దీనికి సబు సైరిల్‌ డిజైన్‌ చేశారు.
 
కె.ఎస్‌. రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రాక్‌లైన్‌ వెంకటేష్‌ నిర్మిస్తున్నారు. ఎఆర్‌ రెహమాన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. అనుష్క మరో హీరోయిన్‌గా నటిస్తోంది. డిసెంబర్‌ 12న పాటల్ని విడుదల చేసే ప్లాన్‌లో వున్నారు. ఈ చిత్రం తన జీవితంలో మర్చిపోలేని సినిమా అవుతుందని నిర్మాత తెలియజేస్తున్నారు. 
 
కాగా తమిళనాడు రాజకీయాల్లో నెలకొన్న స్తబ్దత నేపథ్యంలో రజినీకాంత్ కు రాష్ట్ర భాజపా పగ్గాలు అప్పగించి ఎన్నికల బరిలో దిగాలని భాజపా ఉవ్విళ్లూరుతోంది.