శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 25 నవంబరు 2014 (12:23 IST)

మాఫియా, ఫ్యాక్షన్ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ స్పాట్!

మాఫియా, ఫ్యాక్షన్ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ ''స్పాట్'' అనే సినిమాను రూపొందించనున్నారు. ఆ మధ్య పరిటాల రవి జీవితకథతో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో 'రక్తచరిత్ర' చిత్రాన్ని తీసి వివాదాన్ని రేపాడు. ఇప్పుడు మళ్లీ అదే రాయలసీమ ఫ్యాక్షన్ కథాంశాన్నే తీసుకుని మరో సినిమా చేస్తున్నాడు. 
 
అయితే, దీనికి మారిన రాజకీయ పరిస్థితులను కూడా జోడిస్తున్నాడు. దీని పేరు 'స్పాట్'. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాలో కొత్త నటీనటుల్ని తీసుకున్నాడు. ఈమధ్య నెలకో సినిమా అన్న రీతిలో తీస్తున్న వర్మ, దీనిని కూడా చాలా ఫాస్ట్‌గా పూర్తి చేస్తున్నాడు.