శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: శుక్రవారం, 24 ఏప్రియల్ 2015 (17:04 IST)

వర్మ భార్యను ఎందుకు వదిలేశారు...?! ''365 డేస్''లో చెప్పేశారు...

రామ్‌గోపాల్‌ వర్మ భార్యను వదిలేశాడు. కుమార్తెను మాత్రం దగ్గరకు తీసుకుని పెద్దదాన్ని చేశాడు. సినిమాల్లో నటించే అమ్మాయిలకు మంచి అవకాశాలు ఇస్తుంటాడు. వెంటపడుతుంటాడు. ఏమిటి... దీనికి కారణమేమిటి.. అన్నింటికన్నా వర్మ తన భార్యను ఎందుకు వదిలేశాడు? అనేది ప్రతివారిలోనూ మెదిలే ప్రశ్న. ఈ ప్రశ్నకు ఆయనే సమాధానిమిచ్చాడు. 

 
'365 డేస్‌' అనే సినిమాను వర్మ రూపొందిస్తున్నాడు. నందు, అనైకాసోది జంటగా నటించారు. ఈ సినిమా ఆడియో విడుదలైంది. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ... ఓ జంట ఎమోషన్‌ ఆధారంగా కథ రాసుకున్నాను. అదే సినిమా. ఎటువంటి క్రైం లేకుండా తీసిన సినిమా ఇది. చాలామంది నా పెళ్లెందుకు పెటాకులయిందని అడుగుతున్నారు. దానికిచ్చే సమాధానం ఒక్కటే... నాకు మంచి భార్య దొరికింది. నా భార్యకు చెడ్డ మొగుడు దొరికాడని మాత్రం చెబుతున్నాను' అని చెప్పారు.
 
పూరీ మాట్లాడుతూ.. మగాడు లేకుండా ఆడది బ్రతకలేదు. ఆడది లేకుండా మగాడు బతకలేడు. వాల్లిద్దరూ కలిసి అసలు బతకలేరు. ఇక వర్మతో 20 ఏళ్ళ అనుబంధం. మా మధ్య గొడవలు లేవు అని చెప్పారు.