శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 29 ఆగస్టు 2014 (17:55 IST)

మరో బాలీవుడ్‌ మూవీలో రానా

మొదటి నుంచి దగ్గుబాటి రానా ఇటు తెలుగు సినిమాలతో పాటు, బాలీవడ్‌ చిత్రాల్లోనూ ఆసక్తి చూపుతున్నాడు. ఆ మధ్య 'డిపార్ట్‌మెంట్‌ ' అనే సినిమాలో నటించాడు. అయితే ఇది ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విజయం సాధించేలేకపోయింది. ఇక తెలుగు సినిమాల్లోనూ 'లీడర్‌' చిత్రంతో మెప్పించిన రానా ఆ తర్వాత చెప్పుకోదగ్గ విజయం ఒక్కటి కూడా రాలేదు. 
 
ఈ నేపథ్యంలో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారాడు. తెలుగు, తమిళం‌, సినిమాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం రానా తెలుగులో 'రుద్రమదేవి', 'బాహుబలి' వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు. చరిత్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ రెండు చిత్రాలు వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలతో బిజీగా ఉన్న రానా ఖాళీ టైమ్‌లో హీరోగా ఓ సినిమా చేయాలనుకున్నాడు. 
 
దానికి సంబంధించి ఇంకా కొలిక్కి రానప్పటికీ బాలీవుడ్‌లో మరో సినిమాలో నటించే ఛాన్స్‌ వచ్చింది. అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటిస్తున్న 'బేబీ' అనే సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఇందులో ఓ కీలక పాత్రలో కనిపిస్తాడని బాలీవుడ్‌ టాక్‌. నీరజ్‌ పాండే ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. ఈ మూవీ వచ్చే నెలలో చిత్రీకరణ ప్రారంభమవుతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.