శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 18 నవంబరు 2014 (12:57 IST)

అక్షయ్ కుమార్‌తో రవితేజ పోలిక.. అందుకే ''స్పెషల్ 26''!

అక్షయ్ కుమార్‌తో రవితేజ పోలికలున్నాయని రవితేజ అంటున్నాడు. గతంలో రవితేజ నటించిన 'విక్రమార్కుడు' చిత్రాన్ని అక్షయ్ హిందీలో 'రౌడీ రాథోడ్' పేరిట రీమేక్ చేయగా... అక్షయ్ చేసిన 'స్పెషల్ 26' చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో రవితేజ రీమేక్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని రవితేజ కూడా తాజాగా ధృవీకరించాడు.
 
"బాడీ ప్రకారం చూసుకుంటే మా ఇద్దరి మధ్య బాగా పోలికలున్నాయి. తను రౌడీ రాథోడ్ చేసినప్పుడు, 'ఒరిజనల్‌లో రవితేజ చేసినట్టు నేను చేయలేకపోయాను' అన్నాడు. ఇప్పుడు నేను కూడా అంతే. స్పెషల్ 26లో అక్షయ్ చేసిన దాంట్లో కొంతయినా నేను చేయగలిగితే చాలు" అన్నాడు రవి. ప్రస్తుతం తాను నటిస్తున్న 'కిక్ 2', 'బెంగాల్ టైగర్' చిత్రాల తర్వాత ఈ రీమేక్ సెట్స్‌కి వెళుతుందని చెప్పాడు.