శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: సోమవారం, 15 సెప్టెంబరు 2014 (17:23 IST)

రవితేజ కెరీర్‌లో పేద్ద హిట్‌ అట!

చాలాకాలం తర్వాత రవితేజ నటించిన చిత్రం 'పవర్‌' విడుదలైంది. ఈ చిత్రం ఓపెనింగ్స్‌ చాలా అదుర్స్‌గా వున్నాయి. రవితేజ కెరీర్‌లో పెద్ద హిట్‌ అని దర్శకుడు రవీంద్ర (బాబి) చెబుతున్నాడు. రవితేజ గారికి సినిమా అంటే పేషన్‌. ఆయన ఈ సినిమా డబ్బింగ్‌ లోనే హిట్‌ అని చెప్పేస్తారు. ఏ సినిమా ఎలా ఆడుతుందీ అనేది ముందుగానే చెప్పగల జ్ఞాని అని పొగిడారు. 
 
అన్ని సినిమాలు కలిపి తీశారు అనే విమర్శ గురించి చెబుతూ... బోర్‌ కొట్టకుండా సినిమా తీయడం అనేది దర్శకుడికి తెలియాలి. ఆ విషయంలో నేను మార్కులు సంపాదించాను. థియేటర్లలో సినిమాలు చూశాను. అందరూ తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇది ఏ రేంజ్‌కు వెళుతుందో తెలీదు కానీ... ఈ సినిమా కిక్‌తో కిక్‌-2 రవితేజ చాలా సంతోషంగా చేయబోతున్నాడంటూ అన్నారు. తనకూ పెద్ద నిర్మాతల నుంచి ఆఫర్లు వస్తున్నాయని చెబుతున్నాడు. త్వరలో వెల్లడిస్తానన్నారు.