శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: సోమవారం, 24 నవంబరు 2014 (13:11 IST)

ఆ విషయంలో పవన్ కళ్యాణ్ - అకీరా ఒకటే... రేణూ దేశాయ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య మరోసారి తన పిల్లల గురించి ఓ దినపత్రికతో చెప్పుకొచ్చింది. తన కుమార్తె ఆధ్య తండ్రి పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికీ ఆమె అలవాట్లన్నీ తనవే అంటూ చెప్పింది. ఇక తన కుమారుడు అకిరా నందన్ చూసేందుకు తన పోలికలతో ఉన్నట్లు అనిపించినా అతడి ప్రవర్తన మాత్రం పవన్ ప్రవర్తనలా ఉంటుందని అంది. 
 
అకీరా నడుస్తుంటే అచ్చం పవన్ నడిచినట్లే ఉంటుందట. ఇంకా అతడు పవన్ ఇష్టపడే ఫుడ్ ఐటెమ్స్ ను తింటాడట. అలాగే పవన్ మాదిరిగానే అకిరాకు కూడా ఫంక్షన్స్ అంటే పెద్దగా ఆసక్తి ఉండదనీ, అలాగే ఆడంబరంగా డబ్బు ఖర్చు పెట్టడం కూడా తనకు ఇష్టముండదని చెప్పింది. తన పుట్టినరోజునాడు ఎటువంటి పార్టీలు వద్దని చెప్పిన అకిరా దానికయ్యే ఖర్చును ఏదైనా అనాధ ఆశ్రమానికి ఇద్దామని తనను బలవంతపెడతాడని చెప్పింది రేణు దేశాయ్.