శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 30 జనవరి 2015 (13:50 IST)

రజనీ ఔట్... అజిత్ ఇన్..! లవర్స్ డే గిఫ్ట్‌గా 'రోబో-2' ఫస్ట్ లుక్...!

బ్రహ్మాండాల రూపకర్త శంకర్ దర్శకత్వంలో విడుదలై సూపర్ హిట్ కొట్టిన చిత్రం 'రోబో'. ఈ సినిమాకు సీక్వెల్‌గా 'రోబో-2'ను శంకర్ తీయాలని అనుకున్నారు. 'రోబో' చిత్రంలో హీరో హీరోయిన్లుగా సూపర్ స్టార్ రజనీకాంత్, విశ్వసుందరి ఐశ్వర్యా రాయ్‌లు నటించారు. దీంతో 'రోబో-2'లో కూడా వారినే నటింప చేయాలని శంకర్ తలచారు. 
 
ఇటీవల శంకర్ 'రోబో 2' కథ వినిపించాలని రజనీ వద్దకు వెళ్లగా, అనారోగ్యం కారణంగా ఇందులో నటించేందుకు రజనీ నో చెప్పారట. దీంతో ఈ చిత్రంలో రజనీ స్థానంలో హీరో అజిత్‌ను నటింప చేసేందుకు శంకర్ అనుకుంటున్నట్లు సమాచారం. హీరోయిన్‌గా మాత్రం ఐశ్వర్యను ఫిక్స్ చేశారట. కాగా ఫిబ్రవరి 14వ తేదిన లవర్స్ డే గిఫ్ట్‌గా 'రోబో-2' ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేయనున్నట్టు కోలీవుడ్ టాక్.