శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: గురువారం, 26 మార్చి 2015 (21:31 IST)

వాయిదాపడ్డ సన్నాఫ్‌ కృష్ణమూర్తి...!!

అల్లు అర్జున్‌ వెడ్డింగ్‌ ప్లానర్‌గా ఈ మూవీలో నటిస్తున్న సినిమా 'సన్నాప్‌ సత్యమూర్తి'. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌ లో వస్తున్న చిత్రమిది. ఈ కుటుంబ కథా చిత్రానికి 'విలువలే ఆస్తి' అనేది ట్యాగ్‌ లైన్‌. ఇటీవలే ఈ సినిమా ఆడియోని రిలీజ్‌ చేసారు. అప్పటి నుంచి ఈ సినిమా రిలీజ్‌ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పలు రిలీజ్‌ డేట్స్‌ బయటకి వచ్చినా కచ్చితమైన తేదీ వెలువడలేదు. ఏప్రిల్‌ 3నే విడుదలచేయాలని ప్లాన్‌ చేశారు. 
 
కానీ పోస్ట్‌ప్రొడక్షన్‌లో భాగంగా కొంత ఆలస్యమయ్యేట్లు కన్పిస్తుంది. దాంతో ఏప్రిల్‌ 9న రిలీజ్‌ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.  ఈ ఈనెల 28న ఫస్ట్‌కాపీ సిద్దం కానుంది.  సమంత, ఆద శర్మ, నిత్యా మీనన్‌ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ మూవీకి దేవీశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ అందిస్తున్నాడు. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఉపేంద్ర, స్నేహ, రాజేంద్ర ప్రసాద్‌, బ్రహ్మానందం ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.