శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 24 మార్చి 2015 (13:45 IST)

వెటరన్ కమేడియన్‌తో సదా.. వడివేలుతో హీరోయిన్‌గా..

రజనీకాంత్ హీరోగా శివాజీ సినిమాలో నటించిన శ్రేయ.. తమిళంలో వెటరన్ కమేడియన్ వడివేలు నటించిన తమిళ చిత్రం ఇందిరలోగత్తిల్ నా అళగప్పన్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. కట్ చేస్తే.. శ్రేయ బాటలోనే సదా నడుస్తున్నట్లు తెలుస్తోంది. అసలు సంగతి ఏంటంటే.. వడివేలు ప్రస్తుతం ''ఎలి'' అనే సినిమాలో నటిస్తున్నాడు. 1970 బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాలో వడివేలు సరసన సదా నటిస్తుందని టాక్ వస్తోంది.
 
జయం, అపరిచితుడు వంటి హిట్ సినిమాల్లో నటించి టాప్ హీరోయిన్‌గా  పేరు సంపాదించుకున్న సదా ప్రస్తుతం ఆఫర్లు లేకుండా దొరికిన ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలనుకుంటోంది. ఇందులో భాగంగా సదా వడివేలు హీరోగా నటించే ఎలి మూవీ నటించేందుకు రెడీ అయ్యింది. మరి ఈ సినిమా అయినా సదాకు టర్నింగ్ పాయింట్ అవుతుందో లేదో వేచి చూడాలి.