శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : గురువారం, 5 మార్చి 2015 (12:09 IST)

తెలుగులోకి కన్నడ హిట్.. మెగా హీరోలకే ఛాన్స్..!

టాలీవుడ్‌లో తమిళ భాష నుంచి రీమేక్ చిత్రాలే ఎక్కువగా వస్తున్నాయి. తాజాగా ఓ కన్నడ చిత్రం కూడా రీమేక్ కానున్నట్లు సమాచారం. సంతోష్ ఆనంద్ రామ్ దర్శకత్వంలో కన్నడలో ఇటీవల విడుదలై, ఘన విజయం సాధించిన చిత్రం 'మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి'.
 
ఈ చిత్రాన్ని నిర్మాతలు జయన్న, భోగేంద్రలు తెలుగులోకి రీమేక్ చేయాలని అనుకుంటున్నారట. అది కుదిరితే మెగా హీరోలకే ఛాన్స్ ఇస్తారని సమాచారం. ఎందుకంటే నిర్మాతలకు చిరంజీవితో మంచి అనుబంధం ఉందట. ఇక ఇది కుదిరితే మెగా హీరో సాయిధరమ్ తేజ్‌కు ఆ ఛాన్స్ దక్కే అవకాశం కనిపిస్తుంది. 
 
‘పిల్లా.. నువ్వులేని జీవితం’ అంటూ తన మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న సాయిధరమ్ తేజ్.. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. దాంతోపాటు ఇంకా విడుదల కాని తన సినిమా ‘రేయ్’ విడుదలకు సన్నాహలు జరుగుతున్నాయి.