శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 15 నవంబరు 2014 (12:22 IST)

''కత్తి'' పట్టనున్న సల్మాన్ ఖాన్: పవన్ ఆసక్తి చూపకపోయినా...?

సల్మాన్ ఖాన్ ''కత్తి'' పట్టనున్నాడు. తమిళంలో విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ''కత్తి'' చిత్రం సంచలన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను తెలుగులోకి రీమేక్ చేయాలని అనుకున్నారు. 
 
నిర్మాత ఠాగూర్ మధు తెలుగులోకి డబ్ చేద్దామనుకున్నారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్‌తో దీనిని తెలుగులో రీమేక్ చేద్దామనుకున్నాడు. అయితే, సినిమా చూసిన తర్వాత పవన్ ఈ ప్రాజెక్టు పట్ల ఆసక్తి చూపలేదు. రైతుల సమస్యల ఆధారంగా దీనిని రూపొందించారు.
 
ఈ నేపథ్యంలో కత్తి చిత్రాన్ని సల్మాన్ ఖాన్ చూడడం జరిగిందనీ, హిందీలో దానిని రీమేక్ చేయడానికి సుముఖత వ్యక్తం చేశాడనీ వార్తలు వినిపిస్తున్నాయి.