శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 25 అక్టోబరు 2014 (15:00 IST)

కత్తి కలెక్షన్స్ అదుర్స్: హిట్‌తో ఫుల్ జోష్ మీదున్న సమంత!

అందాల సుందరి సమంత ఫుల్ జోష్ మీదుంది. తమిళంలో ఫ్లాప్‌లనే చవిచూసిన సమంతకు కత్తి టర్నింగ్ పాయింట్‌గా నిలిచిందని కోలీవుడ్ వర్గాల బోగట్టా. సమంత చెన్నై సుందరి అయినప్పటికీ.. అక్కడ ఆమెకు ఆశించని స్థాయిలో హిట్స్ రాకపోవడంతో.. టాలీవుడ్‌లోనే పాగా వేసింది.

ఇటీవలే సూర్యతో అంజాన్ నటించింది. అదీ కాస్త ఫ్లాప్ కావడం.. కత్తి వివాదం కావడంతో సమంత చాలా భయపడింది. అయితే విజయ్ సరసన నటించిన కత్తి సినిమా హిట్ కావడంతో సమంత సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. 
 
తమిళంలో సక్సెస్ అవ్వాలన్న తన చిరకాల వాంఛ ఇక కలగానే మిగిలిపోతుందేమోనని భయపడిన సమంతను కత్తి నిలబెట్టింది. ఈ నేపథ్యంలో విజయ్‌తో ఆమె చేసిన 'కత్తి' కలెక్షన్లలో రికార్డులు క్రియేట్ చేస్తుండడంతో అమ్మడు ఖుషీ అయిపోతోంది.