శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 26 జనవరి 2015 (15:01 IST)

సంజన కారు కొంది.. ఇప్పుడే ఇల్లే కొనేసింది.!

కన్నడ కథానాయిక సంజన అప్పుడప్పుడు టాలీవుడ్‌లో తళుక్కుమంటోంది. ఈ మధ్య తాను కోరుకున్న కారు కొనేసిన సంజన.. ప్రస్తుతం తన డ్రీమ్ హౌస్‌ను కూడా సొంతం చేసుకుంటోంది. దీని గురించి సంజన చెబుతూ, "గత సంవత్సరం నా డ్రీమ్ కారు కొన్నాను. BMW 5 సీరీస్ కారు సొంతం చేసుకున్నాను. ఇక ఈ ఏడాది నా డ్రీమ్ హౌస్ లోకి వెళ్లనున్నాను" అంది.
 
బెంగళూరు నగరంలో పాష్ ఏరియాలో 4000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫస్ట్ ఫ్లోర్‌లో ఈ ఇల్లు కొనుక్కుంది. ప్రస్తుతం తన అభిరుచి మేర విలాసవంతమైన ఫ్లోరింగ్, ఇంటీరియర్స్ చేయించుకుంటోంది. మార్చికల్లా సొంతింట్లోకి వెళుతుందట.
 
"నా యోగా ఫిట్నెస్ సెంటర్ కి ఇది ఎంత దగ్గరంటే, నడచి వెళ్లిపోవచ్చు. అంత మంచి లొకాలిటీలో ఈ ఇల్లు దొరికింది" అంటోంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికీ స్టార్ ఇమేజ్ అంటూ లేని ఈ చిన్నది, ఏకంగా 15 కోట్లు వెచ్చించి ఈ ఇల్లు కొనడం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది!