శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 29 జనవరి 2015 (11:32 IST)

ధనుష్ షమితాజ్.. రజినీకాంత్ సొంత స్టోరీనేనట!

బక్క హీరో ధనుష్ బాలీవుడ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షమితాబ్ అనే సినిమాలో ధనుష్ హీరోగా నటిస్తున్నాడు. ఆర్. బాల్కి దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్ర పోషించిన 'షమితాబ్' చిత్రంలో ధనుష్ బస్ స్టాండులో తినుబండారాలు అమ్ముకునే కుర్రాడిగా... తర్వాత బస్ కండక్టర్‌గా... ఆ తర్వాత సూపర్ స్టార్‌గా కనిపిస్తాడట.
 
అంటే, ఇది అచ్చం రజనీకాంత్ జీవితాన్ని పోలి ఉంటుందని ఇప్పటికే జోరుగా ప్రచారం సాగుతోంది.  అలాగే, రజనీ జీవితంలో చోటు చేసుకున్న పలు ఆసక్తికర సంఘటనలు కూడా ఇందులో వున్నాయంటున్నారు. అయితే, ఈ విషయాన్ని ప్రస్తుతం చిత్రం యూనిట్ గోప్యంగా ఉంచుతోంది!. మరి ఈ విషయం రజినీకాంత్‌కు తెలుసో లేదో?