శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 26 జనవరి 2015 (14:34 IST)

శంకర్‌తో మళ్లీ ఐశ్వర్యారాయ్: ''ఐ'' ఓవర్.. అజిత్‌ సరసన ఐష్!?

మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ అంటే తమిళ దర్శకుడు శంకర్‌కి ప్రత్యేక అభిమానం. అందుకే ఐష్‌తో సినిమా చేయాలంటే శంకర్ ముందుంటాడు. అందుకే, ఇప్పటి వరకు ఆమెతో 'జీన్స్', 'రోబో' వంటి రెండు సినిమాలు చేశాడు. 
 
ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా కూడా చేయడానికి శంకర్ ఉవ్విళ్ళూరుతున్నాడు. 'ఐ' సినిమా తర్వాత తన తదుపరి చిత్రాన్ని అజిత్‌తో చేయడానికి శంకర్ సన్నాహాలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజక్టు గురించి ఇప్పటికే వీరిద్దరి మధ్యా చర్చలు కూడా జరిగాయి. 
 
కాగా, ఈ సినిమాలో కథానాయికగా ఐష్ ను తీసుకోవాలని ఈ దర్శకుడు డిసైడ్ అయ్యాడట. ఈ విషయంలో ప్రస్తుతం ఆమెను కాంటాక్ట్ చేస్తున్నట్టు సమాచారం.