శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 24 నవంబరు 2014 (11:29 IST)

''ఐ'' సంక్రాతికి రెడీ: ఎ.ఆర్. రెహ్మాన్ పని ముగిసిందట!

''ఐ'' రిలీజ్ సంక్రాంతికి రిలీజ్ కానుంది. విక్రం హీరోగా శంకర్ రూపొందిస్తున్న ఈ చిత్రం కొన్నేళ్లుగా చిత్రనిర్మాణాన్ని జరుపుకుంటున్న సంగతి విదితమే. షూటింగు పూర్తి కావడానికే ఈ చిత్రానికి చాలా సమయం పట్టింది.
 
ఇక రీరికార్డింగ్, గ్రాఫిక్స్ వంటి పోస్ట్ ప్రొడక్షన్ కు మరింత సమయం పట్టింది. సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ దీని పోస్ట్ ప్రొడక్షన్‌కి అధిక సమయం తీసుకున్నట్టు వార్తలొచ్చాయి. 
 
ఇప్పుడీ పనులన్నీ ముగింపు దశకు చేరుకున్నట్టు చెబుతున్నారు. సంక్రాంతికి తప్పకుండా రిలీజవుతున్నట్టు తమిళ డిస్ట్రిబ్యూటర్ల నుంచి సమాచారం అందుతోంది.