శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 23 జనవరి 2015 (10:28 IST)

శంకర్ దర్శకత్వంలో అజిత్... త్వరలో కొత్త చిత్రం ఆరంభం..!

బ్రంహ్మాండాల రూపకర్త శంకర్ దర్శకత్వంలో అజిత్ హీరోగా త్వరలో కొత్త చిత్రం రాబోతోంది. శంకర్ దర్శకత్వంలో ఇటీవల విడుదలైన విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న చిత్రం 'ఐ'. ఈ చిత్రంలో తొలుత కాస్త బ్యాడ్ టాక్ వచ్చినప్పటికీ వసూళ్లలో మాత్రం సత్తా చాటుతోంది. దీంతో ఆయన తదుపరి చిత్రంపై కోలీవుడ్‌లో టాక్ మొదలైంది.
 
ఈ స్థితిలో శంకర్ తర్వాత చిత్రంలో అజిత్ హీరోగా నటించనున్నట్లు సమాచారం వెల్లడైంది. దీనికి సంబంధించి వీరిద్దరి మధ్యా ఇప్పటికే చర్చలు కూడా జరిగాయనీ, ప్రస్తుతం సబ్జెక్టు వర్క్ జరుగుతోందనీ కోలీవుడ్ వర్గాల సమాచారం. శంకర్, అజిత్ కాంబినేషన్‌లో వచ్చే కొత్త చిత్రాన్ని ఏ.ఎం. రత్నం నిర్మిస్తున్నారని, ఈ చిత్రం త్వరలో విడుదల అవుతుందని సినీ వర్గాలు తెలుపుతున్నాయి.