శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 31 అక్టోబరు 2014 (11:52 IST)

శ్రద్ధా కపూర్ హాట్ సాంగ్.. యూ ట్యూబ్‌లో హిట్సో హిట్స్!

బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ ఓ హాట్ సాంగ్ చేసింది. మొదటి నుంచీ ప్రతి సినిమాలోనూ ఎంతో నీట్ గా కనిపిస్తూ వచ్చిన బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ తాజాగా ఓ హాట్ సాంగ్ చేసింది. మిగతా వాళ్ల కంటే నేనేం తక్కువ తిన్నానా... అన్న రేంజిలో అందాలు విరజిమ్మింది. 

కరణ్ జొహార్ నిర్మిస్తున్న 'ఉంగ్లీ' సినిమాలో ఈ చిన్నది ఈ ఐటెం పాట చేసింది. ప్రస్తుతం యూ ట్యూబ్ లో ఈ పాట పలు హిట్స్ సొంతం చేసుకుంటూ కుర్రాళ్లలో వేడి పుట్టిస్తోంది.

'డ్యాన్స్ బసంతీ...' అంటూ సాగే ఈ పాటలో మేని విరుపులతో తన అందాలను ప్రదర్శించిన శ్రద్ధా, 'ఇకపై నేను కూడా రెచ్చిపోతాను సుమా' అనే సంకేతాలను ఇస్తున్నట్టుగా కనిపిస్తోంది. నవంబర్ 28న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.