శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 25 మే 2015 (11:48 IST)

అనుష్క గ్రేట్.. ఎంత కష్టపడినా.. దర్శకులదే గొప్పంటున్న బ్యూటీ!

అందాల నటి, అనుష్క అందరిచేత గ్రేట్ అనిపించుకుంటోంది. తమని తాము తగ్గించుకోవడం .. ఎదుటివారి ప్రతిభను అంగీకరించడం అందరివలన అయ్యేది కాదు. అందుకు ఎంతో గొప్ప మనసు వుండాలి .. విశాల హృదయం వుండాలి. అలాంటి వ్యక్తిత్వం కలిగిన కథానాయికలలో అనుష్క ముందువరుసలో కనిపిస్తుంది.

సాధారణంగా కొంతమంది కథానాయికలను కదిలిస్తే, ఆ పాత్ర కోసం అంత కష్టపడ్డామనీ, ఇంత శ్రమపడ్డామని చెబుతుంటారు. అనుష్క మాత్రం అందుకు పూర్తి భిన్నంగా జవాబిచ్చింది. తాము పోషించిన ఏ పాత్ర అద్భుతంగా అనిపించినా అది దర్శకుల గొప్పతనమేనని సింపుల్‌గా చెప్పేసింది.
 
కథను బట్టి .. పాత్రలను బట్టి నటీనటుల ఎంపిక జరుగుతుందనీ, దర్శకుడు చెప్పిన దానిని అర్థం చేసుకుని ఆ పాత్రలో ఇమిడిపోవడానికి తాము ప్రయత్నిస్తూ ఉంటామని అంది. దర్శకుడు ఆశించిన స్థాయిలో నటిస్తున్నానా? లేదా? అనే విషయం పైనే తాను దృష్టిపెడుతూ ఉంటానని చెప్పుకొచ్చింది. అలా దర్శకుల గొప్పతనాన్ని అంగీకరించడం ఆమె గొప్పతనమని చెప్పొచ్చు.