మహేష్ బాబుతో శ్రుతి హాసన్ ఐటెం సాంగ్... ఆగడు కోసం...

Sruthi hassan
IVR| Last Modified గురువారం, 17 జులై 2014 (18:02 IST)
మహేష్ బాబు 'ఆగడు' చిత్రం షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. ఇటీవలే రామానాయుడు స్టూడియోలో పరిసరాల్లోని ఓ భవంతిలో టాకీకు సంబంధించి ప్యాచ్‌ వర్క్‌ పూర్తిచేశారు. ఇప్పుడు ఓ ప్రత్యేక పాటను చేయనున్నారు. దర్శకుడు శ్రీను వైట్ల ఇందులోని పాటకోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారు.

హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్లో గత నాలుగు రోజులుగా రిహార్సల్స్ చేస్తున్నారు. ఈ పాట కోసం డాన్సర్లను తెప్పించకుండా.. శ్రుతిహాసన్‌ చేత వేయించడం తెలిసిందే. ప్రస్తుతం యువత గుండెల్లో కొలువు తీరిన ఈమె చేసే చిందులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర నిర్మాత అనిల్‌ సుంకర తెలియజేస్తున్నారు.

ప్రత్యేక సాంగ్‌ ఆగడు చిత్రానికి ప్రత్యేకంగా ఉంటుందని చెబుతున్నాడు. ఈ చిత్రంలో మహేష్ పోలీసు ఆఫీసర్‌గా నటించనున్నాడు. శ్రీను వైట్ల ఫార్మెట్‌లో పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌లో సాగనుంది.దీనిపై మరింత చదవండి :