శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : సోమవారం, 15 డిశెంబరు 2014 (10:28 IST)

కెమిస్టీ కుదిరింది...! శ్రుతితో మరోసారి జతకట్టేందుకు విశాల్ రెడీ..!

శ్రుతి హాసన్, విశాల్ జంట కెమిస్టీ బాగా కురినట్టుంది. ఈ జంట మరోసారి జతకట్టేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల 'పూజ' సినిమాలో శృతి హాసన్ తో కలసి నటించిన తమిళ, తెలుగు హీరో విశాల్. గతంలో తాను లింగుసామి దర్శకత్వంలో నటించిన 'పందెంకోడి' సినిమా సూపర్ హిట్టయింది. ఆ సినిమా విశాల్‌ని మాస్ హీరోగా ప్రెజెంట్ చేసింది. 
 
ప్రస్తుతం మళ్లీ ఇప్పుడు 'పందెం కోడి'కి సీక్వెల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సినిమా కూడా లింగుసామినే దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. 
 
ఈ సినిమాలో కథానాయిక పాత్రకి శృతి హాసన్ ని సంప్రదిస్తున్నారట. ఇదిలా ఉంచితే, విశాల్ ప్రస్తుతం నటిస్తున్న 'ఆంబల' సినిమా సంక్రాంతి బరిలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది.