శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 24 నవంబరు 2014 (11:56 IST)

లింగా: అనుష్కను డామినేట్ చేసిన సోనాక్షి.. అందాల ఆరబోతలో..!

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'లింగా' సినిమాలో అనుష్కను సోనాక్షి సిన్హా డామినేట్ చేసిందని అంటున్నారు. పాటల్లో కానీ, గ్లామర్లో కానీ, పాత్ర నిడివిలో కానీ సోనాక్షీనే ఎక్కువగా హైలైట్ అయిందని ఈ సినిమా రషెస్ చూసిన వాళ్లు చెబుతున్నారు. 
 
ఇందులో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో వచ్చే రజనీ పక్కన గ్రామీణ యువతిగా సోనాక్షి కనిపిస్తుంది. 
 
అనుష్క మోడరన్ అమ్మాయిగా కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే, దక్షిణాదిన సోనాక్షి కన్నా అనుష్కనే పాప్యులర్. అయితే, వయసులో సోనాక్షి చిన్నది కావడంతో ఆమెనే ఎక్కువగా ఫోకస్ చేసివుంటారని అంటున్నారు.