శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 28 నవంబరు 2014 (21:29 IST)

సోనమ్ కపూర్... మోస్ట్ స్టయిలిష్ సెలబ్రిటీ

బాలీవుడ్ అందాలభామ సోనమ్ కపూర్ తాజాగా బాలీవుడ్ లో 'మోస్ట్ స్టయిలిష్ సెలబ్రిటీ' అని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ వెండెల్ రోడ్రిక్స్ చెపుతున్నాడు. సీనియర్ నటి రేఖ, బిపాసాబసు, అనుష్క శర్మ వంటి సెక్సీ తారలతో పనిచేసిన ఈ డిజైనర్ సోనమ్ గురించి మాట్లాడుతూ ఆమెను పైకెత్తేశాడు. సినిమాల్లో విభిన్న పాత్రలు చేస్తూ ప్రయోగాలు చేసేందుకు సోనమ్ ముందుంటుందని చెప్పుకొచ్చాడు. అలాగే ఫ్యాషనబుల్ ఐటెమ్స్ ఏది చూపించినా దానిని ప్రయోగపూర్వకంగా ఆచరించి చూసేందుకు ఒప్పుకుంటుందని అన్నాడు.
 
అతడు ఇంకా చెపుతూ..."ఫ్యాషన్ ను బాగా అర్థం చేసుకోగల నటి ఆమె ఒక్కతే. అందుకే బాలీవుడ్ లో అత్యంత స్టయిలిష్ సెలబ్రిటీ, స్టయిల్ ఐకాన్ సోనమ్ కపూర్ మాత్రమే. ప్రయోగాలకు తనెప్పుడూ సిద్ధం. మిగతా కథానాయికల్లా కాదు. అవసరమైతే ఓ కార్యక్రమానికి తను మంచి ధోతీ చీరను కూడా కట్టుకోగలదు. ఆమె స్టయిలే సెపరేటు." అని చెప్పుకొచ్చాడు.