1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 23 మే 2015 (13:40 IST)

కె. రాఘవేంద్ర రావు గారూ.. వెరీ హ్యాపీ బర్త్ డే : రాజమౌళి

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు గారి పుట్టినరోజు సందర్భంగా జక్కన్న రాజమౌళి.. ఫేస్ బుక్ ద్వారా బర్త్ డే విషెస్ చెప్పారు. ప్రస్తుతం బాహుబలి ఆడియో రిలీజ్ పనుల్లో బిజీ బిజీగా ఉన్న రాజమౌళి.. రాఘవేంద్రగారి పుట్టినరోజు (మే 22)ను పురస్కరించుకుని ఆయనతో తీయించుకున్న ఫోటోను ఫేస్ బుక్‌లో షేర్ చేశారు. గురువారం రాజమౌళి బాహుబలి ప్రభాస్ కొత్త లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అలాగే తన గురువు అయిన రాఘవేంద్ర గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. 
 
ఇకపోతే.. బాహుబలి ఆడియో వేడుక ఈ నెల 31వ తేదీన అట్టహాసంగా హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరుగనుంది. ఈ వేడుకకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో పాటు అతిరథమహారథులు హాజరు కానున్నారు. కీరవాణి సమకూర్చిన పాటల రిలీజ్ వేడుక ప్రేక్షకులకు కనుల పండుగ కానుందని రాజమౌళి టీమ్ అంచనా వేస్తుంది. పాటలు సైతం శ్రోతలను తప్పకుండా ఆకట్టుకుంటాయని జక్కన్న ఆశిస్తున్నారు.