శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: సోమవారం, 22 జూన్ 2015 (15:05 IST)

రమ్యకృష్ణ శివగామిగా చింపేశారు... రాజమౌళి, బాహుబలి బిజినెస్ రూ.150 కోట్లు...

తెలుగు, తమిళంలో నేరుగా విడుదల చేస్తున్న చిత్రం 'బాహుబలి'. హిందీ, మలయాలంలో విడుదలవుతున్నది డబ్బింగ్‌ వెర్షన్లు. మూడు నెలల తర్వాత విదేశీ భాషల్లో విడుదల చేస్తామని దర్శకుడు రాజమౌళి చెప్పాడు. ప్రత్యేకంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. శివగామి పాత్ర కోసం శ్రీదేవిని పరిశీలించారనేందుకు బదులిస్తూ... మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని శ్రీదేవి, సుస్మితసేన్‌ను ప్రయత్నించాం. కానీ వారు దొరకలేదు. మా అదృష్టంకొద్దీ రమ్యకృష్ణ దొరికారు. ఆవిడ యాక్టింక్ చింపేశారు. శివగామిగా ఆమె నటన అద్భుతం. ఆ పాత్రను మర్చిపోలేమని చెప్పారు. శ్రీదేవి, సుస్మితా, టబు దొరికితే అంత క్లిక్‌ కాదనేది ఆయన అర్థం అన్నమాట.
 
ప్రభాస్‌ కోమాలోకి వెళ్ళలేదు: రాజమౌళి
సినిమా మూడేళ్ళపాటు జరిగితే.. చాలా కథనాలు వచ్చాయి. ప్రభాస్‌ కోమాలోకి వెళ్ళాడని వార్తలు రాశారు. ఏ ఆధారలతో రాశారు? అంటూ ఆవేశపడేవాడిని. టీమంతా ఎమోషన్‌గా ఫీలయ్యేవాళ్ళం. ఇక ఇలాంటివి వస్తూనే వుంటాయని సరిపెట్టుకున్నాం.
 
కాగా బాహుబలి ట్రెయిలర్స్ విడుదలయ్యాక ఆ చిత్రంపై విపరీతమైన క్రేజ్ వచ్చింది. బాహుబలి ది బిగెనింగ్ మొదటి భాగం బిజినెస్ రూ. 150 కోట్ల మేరకు అయిపోయిందనే టాక్ వినిపిస్తోంది. కాగా మొదటి భాగానికి రూ. 125 కోట్లు ఖర్చయినట్లు చిత్ర యూనిట్ నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.