1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : బుధవారం, 4 మార్చి 2015 (17:43 IST)

బాహుబలి విడుదల తేదీ ఖరారు... రాజమౌళి ట్వీట్..!

ప్రభాస్ హీరోగా, హిట్ చిత్రాల దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం బాహుబలి. ఎన్నో రోజులుగా అభిమానులు ఎదురు చూస్తున్న ఈ చిత్రం విడుదలకు సమయం ఆసన్నమైంది. ఈ సినిమా మే 15న విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళీనే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఒక వీడియోను ఆయన ట్విట్టర్‌ పెట్టారు.
 
అందులో ''మా బాహుబలి టీం అంతా ఎంతో సంతోషంగా ఉంది. ఒక్క పాట తప్ప, మొత్తం టాకీ పార్ట్ అంతా పూర్తయింది. బాహుబలి  మొదటి భాగాన్ని మే 15న విడుదల చేస్తున్నానని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నా'' అని రాజమౌళి ట్వీట్ చేశారు. ఇక అభిమానులకు పండగే.