శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : గురువారం, 26 ఫిబ్రవరి 2015 (11:02 IST)

అతిలోక సుందరి లిప్‌లాక్... సుదీప్ స్పందన..!

సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ చిత్రసీమను తన అందం, అభినయంతో ఏలిన బ్యూటీ క్వీన్, అతిలోక సుందరి, స్టార్ హీరోయిన్ శ్రీదేవి, బాలీవుడ్ ఫిలిమ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ ను పెళ్లాడిన తర్వాత 15 ఏళ్లుగా సినిమాల్లో నటించలేదు. ఆ తర్వాత ఇటీవలే ‘ఇంగ్లిష్ వింగ్లిష్' చిత్రం ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆ చిత్రం కూడా వచ్చి నాలుగేళ్లయిపోయింది. ఇప్పుడు తాజాగా తమిళ మూవీ ‘పులి'లో నటించడానికి ఓకే చెప్పిందట.
 
ఈ చిత్రంలో రాణిగా నటిస్తున్న ఆమె, కన్నడ నటుడు సుదీప్ (‘ఈగ’ ఫేమ్)తో లిప్ లాక్ ముద్దుసీనులో పాల్గొందట. ప్రస్తుతం ఈ వార్తలు కోలీవుడ్ తో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. 'ఇళయదళపతి' విజయ్ త్రిపాత్రాభినయం చేస్తున్న 'పులి' చిత్రంలో శ్రీదేవి రాణిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఆమెకు జోడీగా రాజు పాత్రలో సుదీప్ నటిస్తున్నాడు. వీరిద్దరి మధ్య లిక్ లాక్ సన్నివేశాలు చిత్రానికే హైలైట్ గా నిలవనున్నాయని కోలీవుడ్ టాక్.
 
దీనిపై హీరో సుదీప్ స్పందించాడు. శ్రీదేవితో ఎలాంటి లిప్ లాక్ లు లేవని, ఇవన్నీ కేవలం రూమర్లే అంటూ అభిమానుల ఆశలపై నీళ్లు చల్లాడు. అసలు ఇలాంటి పుకార్లు ఎలా పుడతాయో కూడా అర్థం కావడం లేదని తెలిపాడు. ఈ ముద్దుల సన్నివేశం గురించి తనతో ఎవరూ చర్చించలేదని కూడా చెప్పుకొచ్చాడు. కాగా ఇందులో విజయ్ సరసన హన్సిక, శ్రుతిహాసన్‌లు నటిస్తుండగా, వారిద్దరి కంటే శ్రీదేవి ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకుంటోందని సమాచారం.