1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 19 డిశెంబరు 2014 (10:53 IST)

సన్ని హొయలు..! డ్యాన్స్‌కు రూ. 5 కోట్లు...!

పిచ్చెక్కించే అందాలతో కుర్రకారును ఉర్రూతలూగించే సెక్సీ బాంబ్ సన్ని లియోన్. ఆమె ఒక్క సీన్‌లో ఉన్నా ఆ సినిమా బంపర్ హిట్టే. ఇక ఈ బ్యూటీ ఐటెం సాంగ్ ఉందంటే చాలు ఆ సినిమా హాట్‌ కేక్‌లా అమ్ముడు పోతుంది. అందుకే, సన్నీ లియోన్‌కి ఇంతటి క్రేజ్.
 
ఐటెం సాంగ్స్‌ కు భారీగా డిమాండ్ చేసే ఈ భారీ అందాల సుందరి ఈ ఏడాది న్యూ ఇయర్ వేడుకల్లో డ్యాన్స్ చేసి, కుర్రాళ్లను ఉర్రూతలూగించేందుకు సిద్ధమవుతోంది. ఆ రోజు ఈ బ్యూటీ చేయబోయే డ్యాన్స్‌కు తీసుకునే మొత్తం ఎంతో తెలుసా... అక్షరాలా ఐదు కోట్లు. 
 
ఈ నెల 31వ తేది రాత్రి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఓ కన్వెన్షన్ హాలులో నూతన సంవత్సర వేడుకలకు ఓ ఈవెంట్ సంస్థ సన్నీతో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది. ఆ రోజు వేడుకలో అమ్మడు తన ఒంపుసొంపులను ప్రదర్శిస్తూ డ్యాన్స్ చేయడానికి ఏకంగా ఐదు కోట్లు తీసుకుంటోందట.