శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 27 ఏప్రియల్ 2015 (18:51 IST)

రామ్ కపూర్‌తో నటించడం ఎంతో బాగుంది.. ఫన్నీగా ఉంటాడు: సన్నీ లియోన్

''కుచ్ కుచ్ లోచాహై'' సినిమా హీరో రామ్ కపూర్ ఒరిజినల్ హాస్యనటుడని బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్ కితాబిచ్చింది. హీరో రామ్ కపూర్‌తో కలిసి నటించడం ఎంతో బాగుందని, తను చాలా ఫన్నీగా ఉంటాడని, అతనితో షూటింగ్ చేయడం ఎంతో నచ్చిందని సన్నీలియోన్ వెల్లడించింది. 
 
మే 8న ఈ చిత్రం రిలీజ్ కానున్న సందర్భంగా సినిమా బృందం ప్రమోషన్‌‍లో పాల్గొంది. ఈ సందర్భంగా సన్నీ మాట్లాడుతూ, రామ్ కపూర్ సెట్స్‌లో ఉంటే వాతావరణం మొత్తాన్ని ఆహ్లాదకరంగా మార్చేసేవాడని చెప్పింది. 
 
కాగా 45 ఏళ్ల పెళ్లైన వ్యక్తిగా రామ్ కపూర్ నటించాడని, ఓ సందర్భంగా అతను సినిమా హీరోయిన్ (సన్నీ లియోన్)ని కలిసే అవకాశం వస్తుందని, ఆ సందర్భంగా వీరి మధ్య చోటుచేసుకున్న సన్నివేశాలే 'కుచ్ కుచ్ లోచాహై' సినిమా అని దర్శకుడు దేవంగ్ డొలాకియా చెప్పారు.