శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : గురువారం, 18 డిశెంబరు 2014 (09:53 IST)

మరోసారి తాత అవుతున్న సూపర్ స్టార్!

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి తాత హోదా పొందనున్నారు. ఆయన రెండో కూతురు సౌందర్య త్వరలో తల్లి కాబోతోందని టాలీవుడ్ సమాచారం. సౌందర్య తమిళనాడుకు చెందిన పారిశ్రామికవేత్త అశ్విన్ రాంకుమార్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసింది. 
 
ఈమె ఆమధ్య రజనీ నటించిన ' కొచ్చాడియాన్' సినిమా ద్వారా దర్శకురాలిగా కూడా మారింది. కాగా 'లింగా' సినిమాతో తమిళ నాట విజయాన్ని అందుకున్న రజనీకి ఇప్పుడు ఇది మరొక శుభవార్త. కాగా రజనీ పెద్ద కూతురు ఐశ్వర్య ధనుస్‌కు ఇప్పటికే ఇద్దరు పిల్లలు. ఆ విధంగా ఇదివరకే తాత హోదా పొందేశాడు!