శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Ganesh
Last Updated : సోమవారం, 23 జూన్ 2014 (16:58 IST)

డాన్ పాత్రలో సూర్య... "అంజాన్''తో 150 కోట్లు సాధిస్తాడట!

తమిళ స్టార్ హీరో సూర్య, సమంతలు హీరోహీరోయిన్లుగా లింగుస్వామి దర్శకత్వం వహించిన ''అంజాన్'' సినిమా ఆగష్టు 15న రిలీజ్ చేయనున్నారు. ఇందులో సూర్య తొలిసారి డాన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా తెలుగు వెర్షన్‌కు లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఐతే ఈ సినిమాపై సమంత భారీగా ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా ఘనవిజయం సాధిస్తే తమిళంలో మరిన్ని అవకాశాలు వస్తాయని సమంత భావిస్తోంది.

అయితే ఈ సినిమా 150కోట్లు కలెక్షన్స్ సాధిస్తుందని 'అంజాన్' చిత్ర యూనిట్ అంటోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగష్టు 15న తమిళ, తెలుగు మరియు హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. సూర్య, సమంతకి అటు తెలుగు, ఇటు తమిళ భాషల్లో మంచి క్రేజ్ ఉన్ననేపథ్యంలో ఈ సినిమా రెండు భాషల్లోనూ మంచి కలెక్షన్స్ రాబట్టుకుంటాయని అంటున్నారు. అలాగే సూర్య హిందీలో కూడా తన కంటూ ఓ స్మాల్ మార్కెట్‌ని ఏర్పరుచుకుంటున్నాడు. కావున ఈ సినిమా 150 కోట్లు కలెక్షన్స్ సాధిస్తుందని అంటున్నారు. లింగుస్వామి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.