శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (16:53 IST)

మగ దెయ్యంగా సూర్య.. మే 15న 'మాస్' విడుదల..!

దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం హర్రర్, కామెడీ ట్రెండ్ కొనసాగుతోంది. తెలుగు, ముఖ్యంగా తమిళ భాషల్లో థిల్లర్ నేపధ్యంలో సినిమాలు బాగా వస్తున్నాయి. అయితే ఓ స్టార్ హీరో ఇటువంటి సినిమాలో నటించడం కొత్తే. ఆ ధైర్యం కోలీవుడ్ స్టార్ హీరో సూర్య చేశారు. 
 
ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'మాస్'. వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా హర్రర్ అండ్ కామెడీ నేపథ్యానికి చెందింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో సూర్య ఓ దెయ్యం పాత్రలో కనిపిస్తాడ. దెయ్యం సినిమాల్లో దెయ్యం అంటే అది మాములుగా అడదేయ్యం అయ్యుంటుంది. 
 
అయితీ మాస్ సినిమాలో మాత్రం సూర్య మగ దెయ్యంగా ప్రేక్షకులను భయపెట్టబోతున్నాడు. ఈ సినిమాను మే నెల 15వ తేదిన తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.