శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 13 సెప్టెంబరు 2014 (12:06 IST)

ఫుల్ హ్యాపీ మూడ్‌లో తాప్సీ.. కారణమేమిటి?

ఫుల్ హ్యాపీ మూడ్‌లో ఉన్న తాప్సీ.. కారణమేమిటి? అనుకుంటున్నారా.. ఝమ్మంది నాదంతో తెరంగేట్రం చేసిన తాప్సీ ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ నటిస్తోంది. బాలీవుడ్ సినిమా బేబీ సినిమా షూటింగ్‌లో భాగంగా తాప్సీ తన సొంత ఊరుకే వెళ్లిందట. తన సొంత ఊరైన ఢిల్లీలో తొలిసారిగా షూటింగ్‌లో పాల్గొంటోంది. 
 
దీనిపై తాప్సీ హ్యాపీగా మాట్లాడుతూ.."అవును ... ఢిల్లీ మా ఊరు. ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. ప్రస్తుతం 'బేబీ' హిందీ సినిమా షూటింగ్ కోసం ఇక్కడే వున్నాను. ఇక్కడి ప్రాంతాలలో షూటింగ్ కోసం తిరుగుతుంటే, చిన్నప్పుడు స్నేహితులతో కలసి తిరిగినప్పటి జ్ఞాపకాలు కళ్లముందు కదలాడుతున్నాయి. 
 
సినిమాల్లోకి వచ్చాక ఢిల్లీలో షూటింగ్ చేయడం ఇదే ప్రథమం. అందుకే, చాలా ఉత్సాహంగా వుంది" అంటోంది ఈ సొట్టబుగ్గల చిన్నది.
 
అలాగే, ఈ సినిమాలో అక్షయ్‌తో కలసి నటిస్తున్నందుకు మరింత ఆనందంగా వుందట. "బాలీవుడ్‌కి వచ్చిన ఆనతి కాలంలోనే అక్షయ్‌తో కలసి సినిమా చేసే అవకాశం రావడం నా అదృష్టం. చాలా హ్యాపీగా వుంది" అని చెప్పింది. సో.. తాప్సీ హ్యాపీ మూడ్‌కు కారణం అదన్నమాట.