శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: శుక్రవారం, 6 మార్చి 2015 (17:11 IST)

బికినీలు కూడా వేయనని ముందే చెప్పానంటున్న భామ...

సినిమాల్లోకి వచ్చాక క్యారెక్టర్ల పరంగా ఏదిబడితే అది చేయడం తనకు చేతకాదనీ, ముందుగా చెప్పేశానని మిల్కీబ్యూటీ తమన్నా అంటోంది. అందం అనే చిత్రంతో తెలుగులో పరిచయమైన ఈ భామ ఆ తర్వాత చాలాకాలం మళ్ళీ తెలుగు తెరవైపు చూడలేదు. ఆ తర్వాత ఎట్టకేలకు హ్యాపీడేస్‌తో శేఖర్‌ కమ్ముల వెలుగులోకి తెచ్చాడు. అలా కెరీర్‌లో ముందుకు దూసుకు వెళుతున్న తమన్నా... కొన్ని రూల్స్‌ పెట్టుకుందట. 

కమర్షియల్‌ సినిమాల పేరుతో వచ్చే కథల్లో ఎటువంటి లిప్‌లాక్‌లు, బికినీలు వున్నా చేయనంటోంది. అందుకు తాను సిద్ధం కాదని ముందే చెబుతానని అంటోంది. కాగా, బాహుబలిలో ఓ చక్కటి పాత్ర పోషించానని చెబుతూ... ఆ చిత్రంలో నటించాక చాలా నేర్చుకున్నాననీ, ఏ సినిమాపడితే అది చేయడం చాలా తప్పని తెలుసుకున్నానని అంటోంది. ఈ చిత్రం మే నెలలో విడుదల కాబోతుంది. అందులో ఏ తరహా పాత్ర పోషించిందో చూడాల్సిందే.