శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 2 సెప్టెంబరు 2014 (11:38 IST)

నో కన్ఫ్యూజన్.. ఎలాంటి పాత్రలోనైనా నటిస్తా: తమన్నా

దక్షిణాది, ఉత్తరాదిలో అగ్రతార ముద్రవేసుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా.. తాను ఎటువంటి పాత్రల్లోనైనా సరే నటిస్తానని చెబుతోంది మిల్కీ బ్యూటీ తమన్నా. గ్లామర్ పాత్రలు మాత్రమే చేస్తానని తాను ఎప్పుడూ పట్టుపట్టనని అంటోంది. "డీ గ్లామరైజ్డ్ పాత్రల్లో నటిస్తారా? అని నన్ను చాలా మంది అడుగుతుంటారు.
 
నాకు గ్లామర్, డీ గ్లామర్ అనే భేదం లేదు. ఎలాంటి తరహా పాత్రనిచ్చినా చేస్తాను. కథ నచ్చితే కేవలం నటనకు ప్రాముఖ్యత వున్న పాత్రలైనా ఒప్పుకుంటాను. ఈ విషయంలో ఎటువంటి కన్ఫ్యూజనూ లేదు" అని తమన్నా స్పష్టం చేసింది. 
 
కాగా తెలుగులో మహేష్ బాబుతో ఆగడులో నటిస్తున్న తమన్నా.. తమిళంలో శివకార్తికేయన్‌తో రొమాన్స్ చేసేందుకు రెడీ అవుతోంది.