శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : సోమవారం, 27 ఏప్రియల్ 2015 (16:52 IST)

పురుషత్వం లేని భర్త.. వదిలించుకునేందుకు భార్య అత్యాచారం కేసు..!

పురుషత్వం లేని భర్తను వదిలించుకోవడానికి, అతని భార్య అత్యాచారం కేసు పెట్టింది. 2014లో ఓ మహిళ ఆమె భర్త, అత్తింటివారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అందులో భర్తతో సహా కుటుంబ సభ్యులు అందరూ కలిసి తనను బెదిరిస్తున్నారని తెలిపింది. భర్త తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, తనపై అత్యాచారం చేశారని ఓ మహిళ పెట్టిన కేసును స్థానిక కోర్టు సోమవారం కొట్టేసింది. 
 
పురుషత్వం లేని తన భర్తను వదిలించుకోవడానికే ఆ మహిళ అలా తప్పుడు కేసు పెట్టినట్టు న్యాయమూర్తి వీరేంద్రభట్ చెప్పారు. ఆ కారణంగానే మహిళ తన పుట్టినింటికి వెళ్లిపోయి భర్త ఇంటి వారిపై తప్పుడు కేసులు బనాయించినట్టు చెప్పారు.
 
తనపై అత్యాచారం చేశారనే ఆరోపణతో పాటు తన బావ మరిది తన అసహజమైన శృంగారానికి పాల్పడ్డాడని, తన మామ తనపై అత్యాచారానికి ప్రయత్నించాడని ఆ మహిళ పోలీసులు ఇచ్చిన పిటిషన్‌లో పేర్కొంది. అయితే ఈ విషయంలో విడాకులు తీసుకునేందుకు వారిపై ఒత్తిడి పెట్టేందుకే ఈ కేసు పెట్టినట్లు న్యాయమూర్తి చెప్పారు. ఆ మహిళ భర్తను, అత్తామామలను, ముగ్గురు బావామరుదులను, ఇద్దరు వదినలను కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. 
 
ఇంతేకాకుండా కేసు విచారణలో ఉండగానే అత్తింటివారితో, భర్తతో మహిళ ఓ ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది. చివరకు విడాకులు పొందే విషయంలో మహిళ విజయం సాధించిందని, అలాగే తనకు భరణాన్ని కూడా సాధించుకుందని కోర్టు తెలిపింది.