శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 24 సెప్టెంబరు 2014 (17:51 IST)

రాజమౌళిని ఫాలో అవుతున్న టాలీవుడ్ డైరక్టర్లు!

టాలీవుడ్ డైరక్టర్లకు బాహుబలి డైరక్టర్ రాజమౌళి రోల్ మోడల్‌గా నిలిచారు. రాజమౌళి బాటలోనే ఇతర డైరక్టర్లు కూడా ప్రయాణించేందుకు రెడీ అవుతున్నారు.

ఒక పెద్ద స్టార్ హీరోతో హిట్ వచ్చిన వెంటనే మరో స్టార్ హీరోతో సినిమా చేస్తే అంచనాలు విపరీతంగా పెరిగి అసలుకే మోసం వస్తుందని గ్రహించిన డైరక్టర్లు ఒక సినిమాను స్టార్ హీరోతో చేసిన తర్వాత తదుపరి చిత్రాన్ని యంగ్‌హీరోలతో చేస్తున్నారు.

ఈ ఫార్ములాకు రాజమౌళి నాంది పలకడంతో ఇదే బాటలో పూరీ జగన్నాథ్, బోయపాటి శీను వంటి స్టార్ డైరక్టర్లు సైతం ఫాలో అవ్వాలని ఆలోచిస్తున్నారు. 
 
''మగధీర'' వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత రాజమౌళి మర్యాద రామన్న, ఈగ చిత్రాలను తీసి సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఇదేవిధంగా లెజెండ్ వంటి సూపర్ హిట్ తర్వాత దర్శకుడు బోయపాటి శ్రీను బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌తో సినిమా చేస్తున్నాడు. పూరీజగన్నాథ్ విషయానికి వస్తే.. బన్నీతో ఇద్దరమ్మాయిలతో తర్వాత నితిన్‌తో హార్ట్ ఎటాక్ చేశాడు. 
 
ఇప్పుడు ఎన్టీఆర్‌తో సినిమా తర్వాత నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్‌తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. మొత్తానికి రాజమౌళి ఫార్ములాను కొందరు డైరక్టర్లు ఫాలో అయినా.. త్రివిక్రమ్, శ్రీనువైట్ల వంటి డైరక్టర్లు మాత్రం తమ దారి తాము చూసుకుపోతున్నారు. ఏది ఏమైనా రాజమౌళి ఫార్ములా బాక్సాఫీస్ వద్ద ఖచ్చితంగా హిట్ ఫార్ములాగా మారుతుందని టాలీవుడ్ వర్గాల్లో టాక్.